KTR : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. దేశంలోనే అత్యున్నతమైన ప్రజా పాలన అందిస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇవాళ కేంద్రం సైతం తమ పథకాలను , కార్యక్రమాలను కాపీ కొడుతోందంటూ ధ్వజమెత్తారు.
కొందరు రాష్ట్రం గురించి తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, ఇంకొందరు కలల్లో తేలి యాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. పొలిటికల్ టూరిస్టులు ఈ మధ్యన ఎక్కువయ్యారంటూ ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్ ను ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకుందంటూ మండిపడ్డారు. ప్రజలకు ఎలాంటి ఫలితాలు అందుతున్నాయో ముందు తెలుసుకుంటే మంచిదని సూచించారు కేటీఆర్.
గతంలో ఏలిన కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇక కేవలం కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడం ఓట్లను కొల్లగొట్టడమే పనిగా పెట్టుకుందంటూ భారతీయ జనతా పార్టీపై మంత్రి కేటీఆర్(KTR) భగ్గుమన్నారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని సర్వ నాశనం చేశాయని ఆరోపించారు . సోనియా గాంధీని బలి దేవత అంటూ నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఎలా కట్టబెట్టారంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఆయా పార్టీలను జనం నమ్మరన్నారు.
Also Read : లీజు వ్యవహారం కిషన్ రెడ్డి ఆగ్రహం