KKR vs PBKS IPL 2023 : ఉత్కంఠ పోరులో కోల్ కతాదే హవా
మరోసారి గెలిపించిన రింకూ సింగ్
KKR vs PBKS IPL 2023 : నిన్న జైపూర్ లో హైదరాబాద్ ఆఖరి బంతికి సమద్ సిక్స్ కొట్టి తన జట్టును గెలిపిస్తే తాజాగా జరిగిన కీలక మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ యంగ్ స్టర్ రింకూ సింగ్ మరోసారి హీరోగా మారాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి కేకేఆర్ కు చిరస్మరణీయమైన గెలుపును అందించాడు.
ఐపీఎల్ లీగ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ,కోల్ కతా నైట్ రైడర్స్(KKR vs PBKS IPL 2023) మధ్య మ్యాచ్ జరిగింది. ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. మరోసారి పంజాబ్ స్కిప్పర్ శిఖర్ ధావన్ సత్తా చాటాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా తగ్గలేదు.
తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. 47 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు ఒక సిక్సర్ తో 57 రన్స్ చేశాడు. షారుఖ్ ఖాన్ 8 బంతులు ఆడి 21 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. జితేశ్ శర్మ 2 సిక్సర్లతో 21 రన్స్ చేస్తే 2 ఫోర్లు ఒక సిక్సర్ తో హర్ ప్రీత్ బార్ 17 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.
కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీస్తే హర్షిత్ రాణా 2 వికెట్లు కూల్చాడు. అనంతరం 180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపింది. కెప్టెన్ నితీశ్ రాణా దుమ్ము రేపాడు. 38 బంతులు ఆడి 6 ఫోర్లు ఒక సిక్సర్ తో 51 రన్స్ చేశాడు.
జాసన్ రాయ్ 8 ఫోర్లతో 38 చేశాడు. ఇక రస్సెల్ దంచి కొట్టాడు. 23 బంతులు ఎదుర్కొని 42 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. రింకూ సింగ్ హీరోగా మారాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు ఇక సిక్సర్ తో 21 పరుగులు చేశాడు. చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు.
Also Read : కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్