Shikhar Dhawan : ధావన్ మెరిసినా తప్పని ఓటమి
7 వికెట్ల తేడాతో పరాజయం
Shikhar Dhawan : ఐపీఎల్ లీగ్ లో ప్లే ఆఫ్ రేసుకు ఎవరు చేరుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ పేలవమైన ప్రదర్శన ఇబ్బందికరంగా మారింది. ఆ జట్టుకు దురదృష్టం వెంటాడుతోంది. మరో వైపు కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన కీలక పోరులో 7 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది కోల్ కతా నైట్ రైడర్స్.
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ను కోల్ కతా బౌలర్లు కట్టడి చేశారు. ప్రధానంగా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి మ్యాజిక్ చేశాడు. కీలకమైన 3 వికెట్లు తీసి గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలిరేగితే రింకూ సింగ్ తన జట్టును గెలిపించాడు.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. స్కిప్పర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తగ్గలేదు.
47 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు ఒక సిక్సర్ తో 57 రన్స్ చేశాడు. షారుఖ్ ఖాన్ 8 బంతులు ఆడి 21 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. జితేశ్ శర్మ 2 సిక్సర్లతో 21 రన్స్ చేస్తే 2 ఫోర్లు ఒక సిక్సర్ తో హర్ ప్రీత్ బార్ 17 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.
Also Read : రింకూ కమాల్ పంజాబ్ ఢమాల్