Nitish Rana : నితీశ్ రాణా కెప్టెన్సీ ఇన్నింగ్స్

కోల్ క‌తా విజ‌యంలో కీల‌క పాత్ర

Nitish Rana : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ సాధించింది. పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 179 ర‌న్స్ చేసింది.

కోల్ క‌తా బౌల‌ర్లు పూర్తిగా ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ప‌రుగుల వేట ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ కు చుక్క‌లు చూపించారు. శిఖ‌ర్ ధావ‌న్ , షారుఖ్ ఖాన్ రాణించారు. కెప్టెన్ ధావ‌న్ హాఫ్ సెంచ‌రీతో మెరిసాడు. కోల్ క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 3 వికెట్లు తీస్తే హ‌ర్షిత్ రాణా 2 వికెట్లు కూల్చాడు.

అనంత‌రం 180 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్ క‌తా ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ రేపింది. కెప్టెన్ నితీశ్ రాణా(Nitish Rana) దుమ్ము రేపాడు. 38 బంతులు ఆడి 6 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 51 ర‌న్స్ చేశాడు. జాస‌న్ రాయ్ 8 ఫోర్ల‌తో 38 చేశాడు. ఇక ర‌స్సెల్ దంచి కొట్టాడు.

23 బంతులు ఎదుర్కొని 42 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి. రింకూ సింగ్ హీరోగా మారాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు ఇక సిక్స‌ర్ తో 21 ప‌రుగులు చేశాడు. చాహ‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 5వ స్థానంలో నిలిచింది.

Also Read : కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిష‌న్

Leave A Reply

Your Email Id will not be published!