Rinku Singh : రింకూ కమాల్ పంజాబ్ ఢమాల్
కింగ్స్ ఆశలపై నీళ్లు చల్లిన సింగ్
Rinku Singh : యూపీ కుర్రాడు రింకూ సింగ్ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. పంచ్ హిట్టర్ గా ఇప్పటికే పేరు పొందిన ఈ క్రికెటర్ కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆపద్భాంధవుడిగా నిలిచాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు బలంగా మారాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి తన జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. గెలుపు అంచుల దాకా వచ్చిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు చుక్కలు చూపించాడు. ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు రింకూ సింగ్.
జట్టులో టార్చ్ బేరర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవెన్. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. ధావన్ 51 తో మెరిశాడు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది కోల్ కతా నైట్ రైడర్స్.
జట్టు కెప్టెన్ నితీశ్ రాణా మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నితీశ్ రాణా 38 బంతులు ఆడి 51 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఓ సిక్సర్ ఉంంది. జాసన్ రాయ్ 38 పరుగులతో రాణించాడు. ఇక ఆండ్రూ రస్సెల్ 3 పోర్లు 3 సిక్సర్లతో 42 చేశాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన రింకూ సింగ్ దంచి కొట్టాడు.
పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొని సింగ్ 2 ఫోర్లు ఒక సిక్సర్ తో 21 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆఖరి బంతికి 4 రన్స్ కావాల్సి ఉండగా బిగ్ షాట్ తో పంజాబ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
Also Read : ధావన్ మెరిసినా తప్పని ఓటమి