Ishan Kishan : కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిష‌న్

టెస్టు జ‌ట్టుకు ఎంపిక చేసిన బీసీసీఐ

Ishan Kishan : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జ‌ట్టుతో జ‌రిగే ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కు ఆడే భార‌త జ‌ట్టులో కేఎల్ రాహుల్ స్థానంలో ముంబై క్రికెట‌ర్ ఇషాన్ కిష‌న్ ను ఎంపిక చేసింది. ఈ మేర‌కు అధికారికంగా బీసీసీఐ వెల్ల‌డించింది.

ఆస్ట్రేలియాలో టాప్ ఫర్ ఫార్మెన్స్ క‌న‌బ‌ర్చిన ఆట‌గాళ్ల‌లో కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ ఉన్నా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు బీసీసీఐ. మ‌రో ముంబై క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ ను స్టాండ్ బై ఆట‌గాడిగా ఎంపిక చేసింది. మ‌రోసారి సంజూ శాంస‌న్ పై వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శించింది బీసీసీఐ.

బీసీసీఐ సెలెక్ష‌న్ తీరుపై స‌ర్వ‌త్రా నిర‌సన వ్య‌క్తం అవుతోంది. అయినా డోంట్ కేర్ అంటోంది . ప్ర‌స్తుతం బీసీసీఐ అమిత్ షా కొడుకు జే షా క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన కీల‌క పోరులో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్కిప్ప‌ర్ కేఎల్ రాహుల్.

టెస్టు జ‌ట్టుకు తాను అందుబాటులో ఉండ‌డం లేద‌ని, వైద్యులు 3 నెల‌ల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంద‌ని చెప్పారంటూ రాహుల్ పేర్కొన్నాడు. దీంతో బీసీసీఐ ముంబై ఆట‌గాడి వైపు మొగ్గు చూపింది.

Also Read : కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిష‌న్

Leave A Reply

Your Email Id will not be published!