INDIA WTC SQUAD 2023 : సూర్య..రుతురాజ్..ముఖేశ్ కు ఛాన్స్
సంజూ శాంసన్ కు దక్కని అవకాశం
INDIA WTC SQUAD 2023 : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరోసారి తన వివక్షను ప్రదర్శించింది. కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టేసింది. అతడిపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శిస్తోంది. ప్రధానంగా బీసీసీఐ సెక్రటరీ జే షా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ముంబై లాబీయింగ్ కే ప్రయారిటీ దక్కుతోంది.
తాజాగా ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీకి భారత జట్టును ఇప్పటికే ఖరారు చేసింది. కాగా ఐపీఎల్ 16వ సీజన్ లో లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తున్న కేఎల్ రాహుల్ ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వైద్యులు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆటకు దూరమయ్యాడు.
కేఎల్ రాహుల్ స్థానంలో ఆస్ట్రేలియాలో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన సంజూ శాంసన్ ను కాదని ముంబైకి చెందిన ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసింది. ఇదే సమయంలో స్టాండ్ బై ఆటగాళ్లుగా ముగ్గురిని ఎంపిక చేసింది. వారిలో సూర్య కుమార్ యాదవ్ , రుతురాజ్ గైక్వాడ్ , ముఖేశ్ కుమార్ లను ఎంపిక చేసింది. కానీ కావాలని సంజూ శాంసన్ ను పక్కన పెట్టింది.
ఇదిలా ఉండగా సూర్య కుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ ముంబైకి చెందిన ఆటగాళ్లు. ప్రస్తుతం బీసీసీఐలో ముంబై లాబీయింగ్ ఎక్కువగా పని చేస్తోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్ పై వెంకటేశ్ ప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. పైరవీ చేసిన వాళ్లకే ప్రయారిటీ లభిస్తోందన్నాడు.
Also Read : శాంసన్ పై కక్ష బీసీసీఐ వివక్ష