MI vs RCB IPL 2023 : ముంబై బెంగళూరు బిగ్ ఫైట్
పోరుకు సిద్దమైన దిగ్గజ జట్లు
MI vs RCB IPL 2023 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ లో కీలకమైన పోరుకు రంగం సిద్దమైంది. మంగళవారం ముంబై లోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వం లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొనసాగనుంది. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ 6వ స్థానంలో నిలిచింది.
ఇప్పటి దాకా 10 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ లు గెలిచి 5 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. రన్ రేట్ పరంగా ముంబై కంటే ఎక్కువగా ఉంది. ఇక ముంబై ఇండియన్స్ 8వ ప్లేస్ లో నిలిచింది. 10 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ లలో గెలుపొంది 5 మ్యాచ్ లలో పరాజయం పొందింది.
లీగ్ లో ఇవాళ జరిగే మ్యాచ్ 54వది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే గెలవక తప్పదు. మరో వైపు కోల్ కతా నైట్ రైడర్స్ 5వ స్థానంలో నిలిచింది. ఒకవేళ బెంగళూరు గెలిస్తే మరో మెట్టు ముందుకు వెళుతుంది. ముంబైకి బిగ్ అడ్వాంటేజ్. తన స్వంత గ్రౌండ్ లో ఆడడం వల్ల ఎక్కువగా విజయం సాధించేందుకు ఆస్కారం ఉంది.
ఇక ఆర్సీబీ కూడా తక్కువేమీ లేదు. ఇరు జట్లు బలంగా ఉన్నాయి. ఇషాన్ కిషన్ , టిమ్ డేవిడ్, సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ ఉన్నారు ముంబై తరపున. ఇక బెంగళూరు నుంచి చూస్తే విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఆ జట్టుకు అదనపు బలం.
Also Read : సూర్య..రుతురాజ్..ముఖేశ్ కు ఛాన్స్