PCB Objects : ఏసీసీ నిర్ణయం పీసీబీ ఆగ్రహం
జే షా పై భగ్గుమన్న పీసీబీ చైర్మన్
PCB Objects : దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఇప్పుడు క్రికెట్ రంగానికి పాకింది. ప్రస్తుతం ఆసియా కప్ నిర్వహణ నుంచి పాకిస్తాన్ ను తొలగించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ). తటస్థ వేదికలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). సంస్థ చైర్మన్ నజామ్ సేథీ.
భారత్ కు అనుకూలంగా ఒప్పందాన్ని నిర్వహించడంపై పీసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పత్రానికి సవరణలు చేసి దానిని తిరిగి ఏసీసీకి పంపింది. తమకు కాకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ పీసీబీ చైర్మన్ నిప్పులు చెరిగారు. ఇది కేవలం బీసీసీఐకి అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారంటూ మిగతా దేశాల ప్రతినిధులను ప్రశ్నించారు.
తాము టోర్నీని నిర్వహించే సత్తా ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ భారత్ రాక పోయినట్లయితే తటస్థ వేదికలపై నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని పీసీబీ స్పష్టం చేసింది. కానీ అందుకు ఏసీసీ ఒప్పుకోలేదు. ఇది పూర్తిగా తమను ఆర్థికంగా దెబ్బ కొట్టడం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు చైర్మన్.
ఇదిలా ఉండగా పూర్తిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు సేథీ. కాగా ప్రత్యామ్నాయ వేదికలు యూఏఈ లేదా శ్రీలంక లేదా ఒమన్ లో నిర్వహించేందుకు ఏసీసీ సుముఖత వ్యక్తం చేసింది.
Also Read : పాకిస్తాన్ చేజారిన ఆసియా కప్