Foxconn Big Deal : భారీ ధరకు ఫాక్స్ కాన్ సైట్ కొనుగోలు
ఐ ఫోన్ తయారీ దారుగా ఉన్న కంపెనీ
Foxconn Big Deal : ప్రముఖ ఐ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్ కాన్ భారీ ధరకు సైట్ ను బెంగళూరులో కొనుగోలు చేసింది. ఏకంగా $13 మిలియన్లకు కైవసం చేసుకుంది. సదరు కంపెనీ అధికారిక పేరు హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ.
ఫాక్స్ కాన్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ దారు సంస్థ. ఆపిల్ ఐ ఫోన్ కు సంబంధించి ప్రధాన అసెంబ్లర్ గా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఫాక్స్ కాన్ కంపెనీ తమిళనాడులోని తన ప్లాంట్ లో 2019 నుండి భారత్ దేశంలో ఆపిల్ హ్యాండ్ సెట్ లను తయారు చేస్తోంది.
ఈ ఫాక్స్ కాన్ కంపెనీ తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం. బెంగళూరు శివార్లలో భారీ భూమిని కొనుగోలు చేసింది. చైనా నుండి ఉత్పత్తిని విస్తరించాలని చూస్తున్నందున ఆపిల్ సరఫరాదారు మంగళవారం సమర్పించిన ఫైలింగ్ లో వెల్లడించింది.
బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని దేవనహ్లిలో 1.2 మిలియన్ చదరపు మీటర్ల (13 మిలియన్ చదరపు అడుగులు) స్వాధీనం చేసుకున్నట్లు లండన్ స్టాక్ ఎక్స్ంజ్ కు సమర్పించిన ఫైలింగ్ లో సదరు కంపెనీ తెలిపింది. దాని అనుబంధ సంస్థ ఫాక్స్ కాన్(Foxconn Big Deal) హాన్ హై టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్ మెంట్ సైట్ కోసం మూడు బిలియన్ రూపాయలు చెల్లిస్తోందని పేర్కొంది.
Also Read : ముస్లింలలో మంచి వాళ్లు కొందరే