DK Shiva Kumar Nirmala : నిర్మలపై నిప్పులు చెరిగిన డీకే
దేశంలోనే అత్యంత చెత్త ఆర్థిక మంత్రి
DK Shiva Kumar Nirmala : కర్ణాటక రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై(DK Shiva Kumar Nirmala) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలోనే ద్రవ్యోల్బణం అధికంగా ఉందంటూ , కాంగ్రెస్ పార్టీకి విమర్శించే హక్కు లేదంటూ నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు డీకే శివకుమార్.
ఈ దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్థిక మంత్రులు తాను చూశానని కానీ ఇంత పనికి మాలిన, చెత్త ఆర్థిక మంత్రిని తాను చూడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దేశంలో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరిందని ఆవేదన చెందారు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇవాళ కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతి దానికి పన్ను విధిస్తూ పోతోందని మండిపడ్డారు. ఇవాళ జీఎస్టీ పేరుతో చేస్తున్న దోపిడీ అంతా ఇంతా కాదన్నారు.
ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయలేని ప్రభుత్వం, ఆర్థిక మంత్రి ఉన్నా లేనట్టేనని ఎద్దేవా చేశారు. తాను ఆ పదవికి సరిపోదన్నారు. తనకు పాలన చేత కాక తమ పార్టీపై నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు డీకే శివకుమార్. ప్రజలు నేల కేసి కొట్టడం ఖాయమన్నారు. ధరలను అదుపు లో పెట్టలేని, నియంత్రించ లేని నిర్మలకు పదవి ఎందుకని నిలదీశారు.
Also Read : కాంగ్రెస్ కు విమర్శించే హక్కు లేదు