Wrestlers Challenge : బ్రిజ్ భూషణ్ నార్కో టెస్ట్ కు సిద్దమా
సవాల్ విసిరిన మహిళా రెజ్లర్లు
Wrestlers Challenge : తాము చేసిన లైంగిక ఆరోపణలు, వేధింపులు శుద్ద అబద్దమంటూ పదే పదే సంచలన కామెంట్స్ చేస్తూ వస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిప్పులు చెరిగారు మహిళా రెజ్లర్లు. గత ఏప్రిల్ 23 నుండి తమకు న్యాయం చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. వారికి అన్ని పార్టీల నుండి మద్దతు లభించింది.
బుధవారం మహిళా రెజ్లర్ల తరపున సాక్షి మాలిక్ స్పందించారు. దమ్ముంటే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నార్కో టెస్ట్ కు హాజరు కావాలని సవాల్ విసిరారు. ఆయనకు లై డిటెక్టర్ టెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత కొంత కాలం నుంచి మహిళా రెజ్లర్లను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడని ఆరోపించారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు 30 మందికి పైగా మహిళా మల్ల యోధులు రోడ్డుపైకి వచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీంతో మొదట నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాల మేరకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ ఖాకీలు రెండు కేసులు నమోదు చేశారు.
ఇదే సమయంలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అంతే కాకుండా సాగు చట్టాల రద్దు విషయంలో విజయం సాధించిన రైతులు బేషరతుగా మహిళా రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించారు. దీంతో రెజ్లర్ల పోరాటం మరింత ఉధృతంగా సాగుతోంది. ఈ తరుణంలో సాక్షి మాలిక్ చేసిన కామెంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
Also Read : ఆధిక్యం ఖాయం అధికారం తథ్యం