Jagadish Shettar : ఆధిక్యం ఖాయం అధికారం త‌థ్యం

మాజీ సీఎం జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ కామెంట్స్

Jagadish Shettar : క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. బుధ‌వారం రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. మొత్తం 2,516 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా, భార‌తీయ జ‌న‌తా పార్టీని అంటి పెట్టుకుని ఉన్న మాజీ సీఎం జ‌గ‌దీశ్ షెట్ట‌ర్(Jagadish Shettar)ఎన్నిక‌ల కంటే ముందు బిగ్ షాక్ ఇచ్చారు. తాను ఆ పార్టీలో ఉండ‌లేనంటూ బ‌య‌ట‌కు వ‌చ్చారు.

అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న బ‌రిలో నిలిచారు. కాగా బీజేపీ త‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా అవ‌మానానికి గురి చేసింది. జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీలో ఉన్నారు.

ఓటు వేసిన అనంత‌రం మాజీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ని ఖ‌త‌మై పోయింద‌న్నారు. ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయింద‌ని, వాళ్లు మార్పు కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు. తాను గతంలో కంటే ఎక్కువ మెజారిటీని సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం త‌థ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌దీశ్ షెట్ట‌ర్(Jagadish Shettar).

ప్ర‌స్తుత స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌ను కొన‌సాగిస్తోంద‌ని, కేవ‌లం కొంద‌రికే ప్ర‌యారిటీ ఇవ్వ‌డం వ‌ల్ల ప‌త‌నం త‌ప్ప‌ద‌న్నారు. ఇదిలా ఉండ‌గా మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌, కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ త‌మ పార్టీకి 140 సీట్లు రావ‌డం ప‌క్కా అని తేల్చి చెప్పారు.

Also Read : త‌న ఎమ్మెల్యేల‌నే న‌మ్మ‌ని సీఎం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!