Yashasvi Jaiswal : ధోనీ..కోహ్లీ..బ‌ట్ల‌ర్..శాంస‌న్ నాకు ఆద‌ర్శం

రాజ‌స్థాన్ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్

ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ హిస్ట‌రీలో అరుదైన రికార్డ్ న‌మోదు చేశాడు. కేవ‌లం 13 బంతుల్లోనే అత్యంత వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. గ‌తంలో ఇదే లీగ్ లో 14 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ ఇద్ద‌రు ఆట‌గాళ్ల మీద ఉంది. భార‌త జ‌ట్టుకు చెందిన కేఎల్ రాహుల్ , ఆస్ట్రేలియాకు చెందిన పాట్ క‌మిన్స్ ఈ ఫీట్ సాధించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 149 ర‌న్స్ చేసింది. వెంక‌టేశ్ అయ్య‌ర్ , నితీశ్ రాణా మాత్ర‌మే ఆడారు. అనంత‌రం బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 13 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ శివ‌మెత్తితే సంజూ శాంస‌న్ సెన్సేష‌న్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 47 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 15 ఫోర్లు 5 సిక్స‌ర్లతో 98 ర‌న్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇక శాంస‌న్ 29 బంతులు ఎదుర్కొని 47 ర‌న్స్ తో చివ‌రి దాకా ఉన్నాడు.

మ్యాచ్ అనంత‌రం దంచికొట్టిన య‌శ‌స్వి జైస్వాల్ మీడియాతో మాట్లాడాడు. త‌న‌కు న‌లుగురు క్రికెట‌ర్లు ఆద‌ర్శ‌మ‌ని చెప్పాడు. వారిలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, జాస్ బ‌ట్ల‌ర్ , కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ అని కితాబు ఇచ్చాడు. వారి ఆట నుంచి తాను ఎంతో నేర్చుకున్నాన‌ని చెప్పాడు. శాంస‌న్ అందించిన స‌హ‌కారం మ‌రిచి పోలేనంటూ పేర్కొన్నాడు. ప్ర‌ధానంగా కోచ్ సంగ‌క్క‌ర‌, మేనేజ్ మెంట్ కు థ్యాంక్స్ చెప్పాడు.

Leave A Reply

Your Email Id will not be published!