ఐపీఎల్ 16వ సీజన్ నుంచి ఐడన్ మార్క్రామ్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది.
అనంతరం మైదానంలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. హైదరాబాద్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు మన్కడ్. ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసింది. ఈ విజయంలో లక్నో సూపర్ జెయింట్స్ 13 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. దీంతో 4వ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 5వ స్థానానికి పడి పోయింది.
గెలుపు అంచుల్లో ఉన్న సన్ రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లారు ప్రేరక్ మన్కడ్ , నికోలస్ పూరన్. కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొని అజేయంగా 44 రన్స్ చేశాడు. ఇక మన్కడ్ 45 బంతులు ఎదుర్కొని అజేయంగా 64 పరుగులు చేశాడు. వీరికి తోడు మార్కస్ స్టోయినిస్ 25 బంతులు ఎదుర్కొని 40 రన్స్ తో కీలక పాత్ర పోషించాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
15 ఓవర్ల వరకు మ్యాచ్ హైదరాబాద్ నియంత్రణలోనే ఉంది. కానీ ఎప్పుడైతే కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అభిషేక్ శర్మకు 16వ ఓవర్ బౌలింగ్ చేయమని ఇచ్చాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఏకంగా 5 సిక్సర్లు పిండుకున్నారు.