ఐపీఎల్ లో కీలకమైన మ్యాచ్ కు వేదిక కాబోతోంది రాజస్థాన్ లోని జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ కొనసాగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఎవరు గెలిస్తే వాళ్లు ప్లే ఆఫ్ రేసులో నిలుస్తారు. రాజస్థాన్ ముందు కేవలం 2 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉండగా ఆర్సీబీ ముందు 3 మ్యాచ్ లు ఉన్నాయి. ప్రతి జట్టు 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
మరో వైపు లక్నో సూపర్ జెయింట్స్ హైదరాబాద్ ను ఓడించి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. సంజూ శాంసన్ కు ఇది పరీక్షా కాలం. ఒకవేళ ఆర్సీబీ గనుక గెలిస్తే వాళ్లు ప్లే ఆప్ రేసులో నిలుస్తారు. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇది జీవన్మరణ సమస్య.
ఇప్పటి వరకు ఉన్న పాయింట్లను పరిశీలిస్తే తొలి మూడు జట్లు గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్లు క్వాలిఫై కావడం దాదాపు ఖాయమై పోయింది. కేవలం ఒకే ఒక స్లాట్ మాత్రమే మిగిలి ఉంది. నాలుగో స్థానం కలిగి ఉండాలంటే కనీసం 16 పాయింట్లు కలిగి ఉండాలి.
జట్ల పరంగా చూస్తే రాజస్థాన్ జట్టులో జైస్వాల్, బట్లర్ , పడిక్కల్ , శాంసన్ (కెప్టెన్ ) , హిట్మెయర్ , జురెల్ , అశ్విన్ , బౌల్ట్ , జంపా, సందీప్ శర్మ, చాహల్ ఆడతారు.
బెంగళూరు జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్ కాగా కోహ్లీ, మాక్స్ వెల్ , లోమ్రోర్ , కేదార్ జాదెవ్ , దినేష్ కార్తీక్ , కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్ , హసరంగా , సిరాజ్ , హేజిల్ వుడ్ ఉన్నారు.