CSK vs KKR IPL 2023 : చెన్నైకి షాక్ కోల్ క‌తా ఝ‌ల‌క్

దోనీ సేన‌కు త‌ప్ప‌ని ఓట‌మి

ఐపీఎల్ 16వ సీజ‌న్ లో పాయింట్ల జాబితాలో టాప్ లో కొన‌సాగుతున్న మ‌హేంద్ర సింగ్ ధోనీ సేన‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. నితీష్ రాణా సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసి చెన్నై సూప‌ర్ కింగ్స్. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును కేవ‌లం 144 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు. దీంతో విజ‌యం సాధించ‌డం సుల‌భ‌మైంది. విచిత్రం ఏమిటంటే ఈసారి ఐపీఎల్ సీజ‌న్ లో స్వంత మైదానంలో ఆడుతున్న చెన్నైకి , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కి క‌లిసి రాలేదు. ఇత‌ర మైదానాల‌లో ఆడిన మ్యాచ్ ల‌లో అద్భుత విజ‌యాల‌ను న‌మోదు చేశాయి.

ఈ విజ‌యంలో కోల్ క‌తా ఇంకా ప్లే ఆఫ్స్ పై ఆశ‌లు పెట్టుకుంది. 6 వికెట్ల తేడాతో గెలుపొంద‌డం విశేషం. ప్ర‌ధానంగా కెప్టెన్ నితీశ్ రాణా బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకుంటే మ‌రోసారి రెచ్చి పోయాడు రింకూ సింగ్. చెన్నైకి చుక్క‌లు చూపించాడు. జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. రాణా 57 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలితే రింకూ సింగ్ 54 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. దీప‌క్ చాహ‌ర్ 3 వికెట్లు తీశాడు చెన్నై త‌ర‌పున‌. ఇక ప్లే ఆఫ్ లో నిల‌వాలంటే చెన్నై చివ‌రి మ్యాచ్ త‌ప్ప‌క గెల‌వాల్సి ఉంటుంది.

Leave A Reply

Your Email Id will not be published!