Rinku Singh : స‌త్తా చాటిన రింకూ సింగ్

యూపీ కుర్రాడి ఆట‌కు ఫిదా

యూపీ కుర్రాడు రింకూ సింగ్ మ‌రోసారి స‌త్తా చాటాడు. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఐపీఎల్ సీజ‌న్ లో భాగంగా చెన్నై లోని చెపాక్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. ఓ వైపు కెప్టెన్ నితీష్ రాణా ఇంకో వైపు రింకూ సింగ్ బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో అబ్బుర ప‌రిచారు.

మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది చెన్నై సూప‌ర్ కింగ్స్. కోల్ క‌తా బౌలర్లు రాణించారు. చెన్నైని త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేశారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 144 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది ధోనీ సేన‌. అనంత‌రం 145 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 4 వికెట్లు కోల్పోయి 147 ర‌న్స్ చేసింది. దీంతో 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

కెప్టెన్ రాణా, రింకూ సింగ్ క‌లిసి 99 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీలు చేశారు..స‌త్తా చాటారు. కెప్టెన్ నితీశ్ రాణా 44 బంతులు ఎదుర్కొని 57 ర‌న్స్ చేశాడు. ఆట చివ‌రి దాకా ఉన్నాడు. ఇక రింకూ సింగ్ 43 బంతులు ఎదుర్కొని 54 ర‌న్స్ చేశాడు. ఇదిలా ఉండ‌గా 5 ఓవ‌ర్ల‌లోనే 33 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది కోల్ క‌తా. ఆ త‌రుణంలో బ‌రిలోకి దిగిన రింకూ కెప్టెన్ తో క‌లిసి అద్భుతంగా రాణించాడు.

Leave A Reply

Your Email Id will not be published!