Tim David : ముంబైని ఆదుకోని టిమ్ డేవిడ్

5 ప‌రుగుల తేడాతో త‌ప్ప‌ని ఓట‌మి

Tim David : ముంబై ఇండియ‌న్స్ కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. మ్యాచ్ చివ‌రి దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ఐపీఎల్ సీజ‌న్ లో అద్భుతంగా రాణిస్తూ సూప‌ర్ ఫినిష‌ర్ గా పేరు పొందిన టిమ్ డేవిడ్ చివ‌రి దాకా ఆడినా త‌న జ‌ట్టును గెలిపించ లేక పోయాడు. చివ‌ర‌కు చేతులెత్తేయ‌డంతో 5 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలు కావాల్సి వ‌చ్చింది.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 177 ర‌న్స్ చేసింది. కెప్టెన్ కృనాల్ పాండ్యా 49 ర‌న్స్ చేస్తే మార్క‌స్ స్టోయినిస్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. సిక్స‌ర్లు, ఫోర్ల‌తో రెచ్చి పోయాడు. 89 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. అనంత‌రం 178 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది ముంబై ఇండియ‌న్స్. ఆరంభం నుంచే దాడి మొద‌లు పెట్టింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 37 ర‌న్స్ చేస్తే ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ షాన్ దార్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 1 సిక్స్ 8 ఫోర్ల‌తో 59 ర‌న్స్ చేశాడు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన సూర్య కుమార్ యాద‌వ్ 7 ర‌న్స్ చేశాడు. ఇత‌ర ఆట‌గాళ్లు ఎవ‌రూ రాణించ లేదు. చివ‌ర‌కు క్రీజులోకి వ‌చ్చిన టిమ్ డేవిడ్ మ‌రోసారి స‌త్తా చాటాడు. అత‌డు ఉండ‌డంతో ముంబై ఇండియ‌న్స్ త‌ప్ప‌క గెలుస్తుంద‌ని భావించారు ఫ్యాన్స్. కానీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సూప‌ర్ స్పెల్ వేయ‌డంతో ఆశించిన మేర రాణించ లేక పోయాడు. గెలుపు అంచుల దాకా తీసుకు వ‌చ్చినా జ‌ట్టును గెలిపించ లేక పోయాడు టిమ్ డేవిడ్. 32 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read : Ishan Kishan

Leave A Reply

Your Email Id will not be published!