Mohisin Khan : లక్నో వేదికగా జరిగిన రసవత్తర పోరులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నువ్వా నేనా అన్నంతగా సాగింది చివరి ఓవర్ వరకు. ఆఖరి ఓవర్ ను లక్నో జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా మొహిసిన్ ఖాన్ కు ఇచ్చాడు. స్కిప్పర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఓ వైపు తన తండ్రి అనారోగ్యానికి గురై ఐసీయూ నుంచి తిరిగి వచ్చాక తీవ్ర టెన్షన్ కు లోనయ్యాడు మొహిసిన్ ఖాన్. కానీ ఆ టెన్షన్ ను తను బయటకు కనిపించ నీయలేదు.
చివరి ఓవర్ లో ముంబై ఇండియన్స్ గెలుపొందాలంటే 11 రన్స్ చేయాలి. ఇక క్రీజులో ఉన్నది ఎవరో కాదు మోస్ట్ పాపులర్ క్రికెటర్, స్టార్ హిట్టర్ అండ్ ఫినిషర్ గా పేరు పొందిన టిమ్ డేవిడ్. ఈ ఐపీఎల్ సీజన్ లో గెలవదని అనుకున్న మ్యాచ్ ను గెలిపించిన మగాడు. కానీ అంతటి టాప్ హిట్టర్ ను ముప్పు తిప్పలు పెట్టాడు మొహిసిన్ ఖాన్. కళ్లు చెదిరే బంతులు వేసి కట్టడి చేశాడు. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది.
ఓ వైపు తండ్రి అనారోగ్యానికి గురైనా ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు. ముంబై ఇండియన్స్ పరాజాయన్ని శాసించాడు. దీంతో మోహిసిన్ ఖాన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారాడు. కీలకమైన గెలుపుతో ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ రేస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
Also Read : Krunal Pandya