TTD Tickets : ఆర్జిత సేవలు..దర్శన టికెట్ల షెడ్యూల్
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
TTD Tickets : శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీివారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ విడుదల చేసింది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
ప్రతి నెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్ట దళ పాద పద్మారాధన, ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపింది. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం , ఊంజల్ సేవ , సహస్ర దీపాలంకార సేవలతో పాటు వర్చువల్ సేవా టికెట్లను 21న విడుదల చేస్తారు. అంతే కాకుండా శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23న అందుబాటులోకి తేనుంది టీటీడీ.
అదే విధంగా రూ. 300 దర్శన టికెట్ల కోటాను ఈనెల 24న , తిరుపతిలో గదుల కోటాను 25న , తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Also Read : Prashant Kishor