Lian Livingstone : లియాన్ లివింగ్ స్టోన్ సెన్సేషన్
5 ఫోర్లు 9 సిక్సర్లు 94 పరుగులు
Lian Livingstone : హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరిగిన కీలక ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ గెలుపు అంచుల దాకా వచ్చి బోల్తా పడింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కానీ పంజాబ్ జట్టుకు చెందిన లియాన్ లివింగ్ స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ వార్నర్ 46 రన్స్ చేస్తే పృథ్వీ షా 54 పరుగులతో రాణించాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన రిలీ రోసౌవ్ చితక్కొట్టాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు.
అనంతరం 214 పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ నిరాశ పరిచాడు. గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ , అథర్వ టైడే రెండో వికెట్ కు 50 రన్స్ జోడించారు. సిమ్రాన్ 19 బంతులు ఎదుర్కొని 22 రన్స్ చేశాడు. టైడే 42 బతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 55 రన్స్ చేశాడు.
జితేశ్ శర్మ , షారుఖ్ ఖాన్ నిరాశ పరిచారు. ఇక మైదానంలోకి వచ్చిన లియాన్ లివింగ్ స్టోన్ దంచొ కొట్టాడు. ఒకానొక దశలో ఢిల్లీని కంగారెత్తించాడు. 48 బంతులు ఎదుర్కొన్న స్టోన్ 5 ఫోర్లు 9 సిక్సర్లతో 94 రన్స్ చేశాడు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 రన్స్ చేసింది.
Also Read : Rilee Rossouw