Shahrukh Khan : షారుఖ్ ఖాన్ షాన్ దార్

పంజాబ్ ఇన్నింగ్స్ లో కీల‌క పాత్ర

Shahrukh Khan : రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు షారుఖ్ ఖాన్(Shahrukh Khan). కానీ రాజస్థాన్ చివ‌ర్లో మ్యాజిక్ చేయ‌డంతో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ ఆద్యంత‌మూ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో ఇరు జ‌ట్లు స‌త్తా చాటాయి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవెన్.

ఆరంభం లోనే కీల‌క‌మైన వికెట్ల‌ను కోల్పోయింది. బౌల్ట్, న‌వ‌దీప్ శైనీ బౌలింగ్ దెబ్బ‌కు వికెట్ల‌ను పారేసుకున్నారు. షారుఖ్ ఖాన్(Shahrukh Khan) షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతులు ఆడి 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 41 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

50 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్ప‌యి ఇబ్బందుల్లో ఉన్న త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చిన జితేశ్ శ‌ర్మ‌, సామ్ క‌ర‌న్ లు ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డారు. షారుఖ్ ఖాన్ కూడా దంచి కొట్టాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది. రెండో బంతికే బౌల్ట్ దెబ్బ‌కు ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ 2 ప‌రుగుల‌కే చాప చుట్టేశాడు. శిఖ‌ర్ ధావ‌న్ 17 ర‌న్స్ తో నిరాశ ప‌రిచాడు. అథ‌ర్వ టైడే 19 ర‌న్స్ , లియామ్ లివింగ్ స్టోన్ 9 ప‌రుగులు చేసి నిరాశ ప‌రిచాడు.

ఈ స‌మ‌యంలో సామ్ క‌ర‌న్ . 31 బాల్స్ ఆడి 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 49 ర‌న్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. జితేశ్ శ‌ర్మ ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దాడు. 28 బంతులు ఆడి 3 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 44 ర‌న్స్ చేశాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

Also Read : Jitesh Sharma

Leave A Reply

Your Email Id will not be published!