Yashasvi Jaiswal : మెరిసిన య‌శ‌స్వి జైస్వాల్

హాఫ్ సెంచ‌రీతో సూప‌ర్

Yashasvi Jaiswal : ఐపీఎల్ 16 సీజ‌న్ లో మ‌రోసారి మెరిశాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్(Yashasvi Jaiswal). ఇప్ప‌టికే టాప్ స్కోర్ జాబితాలో 2వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇప్ప‌టి దాకా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయిన జైస్వాల్ మ‌రోసారి త‌న అసాధార‌ణ‌మైన నైపుణ్యంతో క‌ళ్లు చెదిరే షాట్స్ కొట్టాడు. ఫోర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ కు దిగింది పంజాబ్ కింగ్స్ ఎలెవెన్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది. జితేశ్ శ‌ర్మ‌, షారుఖ్ ఖాన్, సామ్ క‌ర‌న్ రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను ఆడుకున్నారు.

అనంత‌రం మైదానంలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 188 ర‌న్స్ ఛేద‌నలో ఆరంభంలోనే అద్భుత‌మైన జోస్ బ‌ట్ల‌ర్ వికెట్ ను కోల్పోయింది. క‌గిసో ర‌బాడా సూప‌ర్ బాల్ కు గోల్డెన్ డ‌కౌట్ గా వెనుదిరిగాడు. ఈ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు.

ప‌డిక్క‌ల్ తో క‌లిసి య‌శ‌స్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతులు ఎదుర్కొన్న య‌శ‌స్వి 8 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీ చేశాడు. కీల‌క‌మైన పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన షిమ్రోన్ హెట్మెయ‌ర్ జోర్దార్ ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. హెట్మెయ‌ర్ 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 46 ర‌న్స్ చేశాడు. సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్న ప‌డిక్క‌ల్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Also Read : Devadutt Padikkal

Leave A Reply

Your Email Id will not be published!