Shimron Hetmyer : చిత‌క్కొట్టిన షిమ్రోన్ హెట్మెయ‌ర్

28 బంతులు 4 ఫోర్లు 3 సిక్స‌ర్లు

Shimron Hetmyer : విండీస్ స్టార్ హిట్ట‌ర్ షిమ్రాన్ హెట్మెయ‌ర్(Shimron Hetmyer) మ‌రోసారి స‌త్తా చాటాడు. ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన ఐపీఎల్ కీల‌క లీగ్ పోరులో దుమ్ము రేపాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌త్య‌ర్థి పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. కెప్టెన్ సంజూ శాంస‌న్ 2 ప‌రుగుల‌కే చాప చుట్టేస్తే మైదానంలోకి వ‌చ్చిన షిమ్రాన్ హిట్మెయ‌ర్(Shimron Hetmyer) ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

188 ప‌రుగుల భారీ స్కోర్ ను ఛేదించేందుకు బ‌రిలోకి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆదిలోనే జోస్ బ‌ట్ల‌ర్ ను కోల్పోయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ చుక్క‌లు చూపించాడు. ఎప్ప‌టి లాగే య‌శ‌స్వి జైస్వాల్ రాణించాడు. 8 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. ఓ వైపు ప‌డిక్క‌ల్ ఆట‌కు భిన్నంగా ఆడాడు. ఒకానొక ద‌శ‌లో రాజ‌స్థాన్ ఓడిపోతుంద‌ని అనిపించింది.కానీ ఆట స్వ‌రూపాన్నే మార్చేశాడు షిమ్రోన్ హిట్మెయ‌ర్. ఆఖ‌రులో సిక్స్ కొట్ట‌బోయి ఔట్ అయ్యాడు.

షిమ్రోన్ హెట్మెయ‌ర్ జోర్దార్ ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. పంజాబ్ బౌల‌ర్ల ను ఆడుకున్నాడు. హెట్మెయ‌ర్ కేవ‌లం 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 46 ర‌న్స్ చేశాడు. సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్న దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

ఐపీఎల్ లో ఈసారి ఆరంభంలో అదుర్స్ అనిపించినా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రెండో సెష‌న్ లో ఘోరంగా విఫ‌ల‌మైంది. గ‌త ఏడాది ఐపీఎల్ సీజ‌న్ లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన జ‌ట్టేనా ఇది అన్న అనుమానం క‌లుగుతోంది. సంజూ శాంస‌న్ పేల‌వ‌మైన ఆట తీరు కూడా జ‌ట్టుకు శాపంగా మారింది.

Also Read : Yashasvi Jaiswal

Leave A Reply

Your Email Id will not be published!