Dhruv Jurail : పంజాబ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన జురైల్

అద్భుత‌మైన సిక్స‌ర్ తో రాజ‌స్థాన్ గెలుపు

Dhruv Jurail : ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కానీ ప్లే ఆఫ్ ఛాన్సెస్ త‌క్కువ‌గా ఉన్నాయి. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ‌కు తెర లేపింది ఈ మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది. ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆ జ‌ట్టును సామ్ క‌ర‌న్, జితేశ్ శ‌ర్మ‌, షారుఖ్ ఖాన్ అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నారు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆదిలోనే జోస్ బ‌ట్ల‌ర్ వికెట్ ను కోల్పోయింది. ఈ త‌రుణంలో క్రీజులోకి వ‌చ్చిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ త‌న ఆట‌కు భిన్నంగా ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌ను వ‌చ్చీ రావ‌డంతోనే అటాకింగ్ మొద‌లు పెట్టాడు. ఫోర్లు సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. 51 ర‌న్స్ చేశాడు. మ‌రో వైపు ఈ సీజ‌న్ లో సూప‌ర్ ఫామ్ తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న పానీ పూరీ కుర్రాడు య‌శ‌స్వి జైస్వాల్ 8 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీ చేశాడు.

శాంస‌న్ 2 ప‌రుగుల‌కే వెనుదిరిగితే క్రీజులోకి వ‌చ్చిన రియాన్ ప‌రాగ్ క‌ళ్లు చెదిరే సిక్స‌ర్ల‌ను బాదాడు. ఆ త‌ర్వాత షిమ్రోన్ హిట్మెయ‌ర్ దంచి కొట్టాడు. ఫోర్లు, సిక్స‌ర్ల మోత మోగించాడు. 46 ర‌న్స్ చేశాడు. ఇక కీల‌క‌మైన ఆఖ‌రి ఓవ‌ర్ లో 9 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది. బౌల‌ర్ బౌల్ట్ ఉన్నాడు. గెలుస్తుందో లేదోన‌న్న ఉత్కంఠ‌. చివ‌ర‌కు 2 బంతులు 5 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది. మైదానంలో ఉన్న ధ్రువ్ జురైల్(Dhruv Jurail) భారీ సిక్స‌ర్ కొట్టాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించాడు. పంజాబ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు.

Also Read : Shimron Hetmyer

Leave A Reply

Your Email Id will not be published!