KTR : హైదరాబాద్ లో అలయంట్ కంపెనీ
9 వేల ఉద్యోగాలు వస్తాయన్న కేటీఆర్
KTR : మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయనకు యూఎస్ లోని హ్యూస్టన్ లో ఘన స్వాగతం లభించింది. కలిసేందుకు పోటీ పడ్డారు అక్కడి వాసులు. ఈ సందర్భంగా అలయంట్ గ్రూప్ కంపెనీ సిఇఓ మంత్రి కేటీఆర్(KTR)) తో భేటీ అయ్యారు. బీఎఫ్ఎస్ఐ రంగానికి భారత్, తెలంగాణ ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
ఇందులో భాగంగా హైదరాబాద్ లో అలయంట్ గ్రూప్ కంపెనీని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల ఇక్కడ స్థానికంగా ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన వారికి భారీ ఎత్తున ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దాదాపు 9,000 వేలకు పైగానే జాబ్స్ రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. హైదరాబాద్ లో బీఎఫ్ఎస్ఐ రంగం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఈ కంపెనీ వల్ల ట్యాక్స్ , అకౌంటింగ్ , ఆడిట్ సర్వీసెస్ , కోర్ ఐటీ టెక్నాలజీలతో యువతకు గొప్ప అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలయంట్ కంపెనీ అమెరికాలో మంచి గుర్తింపు పొందింది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ ను ఎంచుకున్నాయి. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, టెలికాం, ఏరో స్పేస్, తదితర సంస్థలు కొలువు తీరాయి. ఇవాళ దేశానికి ఆదర్శ ప్రాయంగా మారింది తెలంగాణ. ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు మంత్రి కేటీఆర్. ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది.
Also Read : Karnataka New Cabinet