MI vs SRH IPL 2023 : ముంబై హైదరాబాద్ బిగ్ ఫైట్
నిలుస్తుందా లేక గెలుస్తుందా
MI vs SRH IPL 2023 : స్వంత మైదానం ముంబైలో ముంబై ఇండియన్స్(MI) ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. 14 మ్యాచ్ లకు గాను 13 మ్యాచ్ లు ఆడింది. 7 మ్యాచ్ లు గెలుపొందగా 6 మ్యాచ్ లలో ఓడి పోయింది. ఇక ప్లే ఆఫ్స్ లో మూడు జట్లు చేరుకున్నాయి. కేవలం ఒకే ఒక్క స్థానం మిగిలి ఉంది. దీని కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై జట్లు పోటీ పడుతున్నాయి. అటు ముంబైకి ఇటు ఆర్సీబీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఇరు జట్లు ఆదివారం తలపడనున్నాయి.
ప్లే ఆఫ్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. హోం పిచ్ కావడంతో ముంబై ఇండియన్స్ కు బిగ్ ఛాన్స్. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ జట్టు గెలుస్తుందో సరిగా చెప్పలేం. ఇదే లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ అతి కష్టం మీద గెలుపొందింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది.
హైదరాబాద్ సన్ రైజర్స్(SRH) కు ఇది ఆఖరి మ్యాచ్ . ఆ జట్టు ఇప్పటి దాకా 13 మ్యాచ్ లు ఆడింది. 4 మ్యాచ్ లు మాత్రమే గెలుపొందగా 9 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ లో ముంబై పై గెలిచి ప్రతీకారం తీర్చు కోవాలని అనుకుంటోంది హైదరాబాద్. ఇరు జట్లు ఆట పరంగా బలంగా ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ దే పై చేయిగా ఉంది. మైదానంలోకి దిగితే కానీ ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేం.
Also Read : Rinku Singh Super