RCB vs GT IPL 2023 : సమ ఉజ్జీల పోరుకు సిద్దం
బెంగళూరు వర్సెస్ గుజరాత్
RCB vs GT IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్(GT) , ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పోటీ పడనున్నాయి. ఆదివారం వేదికగా ఈ రెండు జట్లు హోరా హోరీగా తలపడేందుకు సిద్దమవుతున్నాయి.
ఇరు జట్లు బలంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరుకు అత్యంత ముఖ్యం. ఇవాళ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసుకు చేరుకుంటుంది ఆర్సీబీ. లేక పోతే ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. మరో వైపు ముంబై ఇండియన్స్ సైతం పాయింట్ల రేసులోకి రావాలని తహ తహ లాడుతోంది. మాజీ ఛాంపియన్ ముంబైకి , ఇప్పటి దాకా టైటిల్ గెలవని బెంగళూరు జట్లు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి.
అన్ని రంగాలలోనూ ఆర్సీబీ కంటే బలంగా కనిపిస్తోంది గుజరాత్ టైటాన్స్. ఈ జట్టు ఇప్పటి దాకా 13 మ్యాచ్ లు ఆడింది. 9 మ్యాచ్ లలో గెలుపొందింది. కేవలం 4 మ్యాచ్ లలో మాత్రమే ఓటమి పాలైంది. ఇక బెంగళూరు టీం 13 మ్యాచ్ లు ఆడింది. 7 మ్యాచ్ లలో గెలుపొందింది. 6 మ్యాచ్ లలో పరాజయం పాలైంది. ఇది గెలిస్తేనే నిలుస్తుంది. లేకపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ముంబై గెలిస్తే నేరుగా ఆర్సీబీని నెట్టేస్తుంది. ఈసారి 4వ స్థానం కోసం మూడు జట్లు వేచి చూస్తున్నాయి. అవి ఆర్సీబీ, ఆర్ఆర్, ముంబై . ఇవాల్టితో ఏ జట్టు ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుందో తేలి పోతుంది.
Also Read : MI vs SRH IPL 2023