Chiranjeevi Raj : రాజ్ మరణం తీరని లోటు – చిరంజీవి
ఎన్నో సినిమాలకు సంగీతం ఇచ్చారు
Chiranjeevi Raj : ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర సంతాపం తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారని గుర్తు చేశారు. సంగీతం పట్ల , సాహిత్యం , సినిమా రంగం పట్ల ప్రతిభా పాటవాలు కలిగిన అరుదైన దర్శకుడు రాజ్ అని కొనియాడారు.
తన కెరీర్ తొలి దశలలో తను నటించిన చిత్రాలకు పని చేశారని, అందులో ఎన్నో విజయవంతమైన , జనాదరణ కలిగిన బాణీలు స్వర పరిచిన ఘనత రాజ్ ద్వయానికి దక్కుతుందని పేర్కొన్నారు చిరంజీవి. ఆయన అందించిన పాటలు తన సినిమాలు సక్సెస్ అయ్యేలా తోడ్పడ్డాయని తెలిపారు. తనను ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా చేశాయని కొనియాడారు రాజ్ ను.
రాజ్ అకాల మరణం , ఆయన సాగించిన ప్రస్థానం తెలుగు సినిమాకు తీరని లోటు అని ఆవేదన చెందారు. సంగీత దర్శకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఇదిలా ఉండగా రాజ్ చిరంజీవి సినిమాలకు పని చేశారు. ముఠా మేస్త్రీ, బావ బావమరిది హిట్ గా నిలిచాయి. ఆదివారం రాజ్ తన ఇంట్లో గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. ఆయనకు 68 ఏళ్లు. భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
Also Read : Raj Music Director