MI vs SRH IPL 2023 : సేమ్ సీన్ హైద‌రాబాద్ ప‌రేషాన్

శ‌త‌క్కొట్టిన కామెరాన్ గ్రీన్

MI vs SRH IPL 2023 : ముంబై ఇండియ‌న్స్(MI) ద‌ర్జాగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. కీల‌క మ్యాచ్ లో స‌త్తా చాటింది. ఆల్ రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 47 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 8 సిక్స‌ర్లతో రెచ్చి పోయాడు. 100 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబైని ద‌గ్గ‌రుండి గెలిపించాడు. స్టేడియం న‌లు వైపులా క‌ళ్లుచెదిరే షాట్స్ తో అల‌రించాడు. ఇదిలా ఉండ‌గా అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) ఓట‌మి పాలైంది.

పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో నిలిచింది. కోట్లాది రూపాయ‌లు వెచ్చించినా హైద‌రాబాద్ ఆశించిన మేర రాణించ లేక పోయింది. కాగా ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు భారీ స్కోర్ సాధించింది. ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించింది. ఇక కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 65 ప‌రుగులు చేసి రాణించాడు. సూర్య కుమార్ యాద‌వ్ 25 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో కేవ‌లం 2 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. 16 పాయింట్లు సాధించి నాలుగో బెర్త్ క‌న్ ఫ‌ర్మ్ చేసుకునేందుకు రెడీ అయ్యింది. రోహిత్, కామెరూన్ క‌లిసి 128 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇక హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ , నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీశారు.

అంత‌కు ముందు హైద‌రాబాద్ బ్యాట‌ర్లు రెచ్చి పోయారు. 5 వికెట్లు కోల్పోయి 200 ర‌న్స్ చేసింది. మ‌యాంక్ అగ‌ర్వాల్ అద్భుతంగా ఆడాడు. 46 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 83 ర‌న్స్ చేశాడు. వివ్రాంత్ శ‌ర్మ 47 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో దంచి కొట్టారు. 69 ప‌రుగులు చేశాడు. ముంబై ఇండియ‌న్స్ పై ఇదే భారీ స్కోర్ కావ‌డం విశేషం హైద‌రాబాద్ కు.

Also Read : PM Touches Modi Feet

Leave A Reply

Your Email Id will not be published!