Cameron Green : కామెరాన్ గ్రీన్ సెన్సేష‌న్

47 బాల్స్ 8 ఫోర్లు 8 సిక్స‌ర్లు

Cameron Green : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా ముంబై వేదికగా జ‌రిగిన కీల‌క పోరులో ముంబై ఇండియ‌న్స్ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 200 ర‌న్స్ చేసింది. మ‌యాంక్ అగ‌ర్వాల్ దంచి కొట్టాడు. 86 ర‌న్స్ చేశాడు. వివ్రాంత్ శ‌ర్మ 69 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు.

అనంత‌రం బారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్లు చిత‌క్కొట్టారు హైద‌రాబాద్ బౌల‌ర్ల‌ను. కామెరాన్ గ్రీన్(Cameron Green) తో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ దుమ్ము రేపారు. కేవ‌లం 47 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 8 సిక్స‌ర్లతో రెచ్చి పోయాడు. 100 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 65 ప‌రుగులు చేసి రాణించాడు. సూర్య కుమార్ యాద‌వ్ 25 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోతే చూస్తూ ఊరుకుండి పోయారు హైద‌రాబాద్ బౌల‌ర్లు కామెరాన్ గ్రీన్ ను. వాంఖ‌డే స్టేడియం పూర్తిగా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో నిండి పోయింది. ఇరు జ‌ట్లు భారీ స్కోర్ న‌మోదు చేశాయి. కానీ చివ‌ర‌కు విజ‌యం ముంబైని వ‌రించింది. ఈ విజ‌యంలో కీల‌క‌మైన పాత్ర పోషించాడు కామెరాన్ గ్రీన్. అన్నీ తానై ముందుండి న‌డిపించాడు. రోహిత్ శ‌ర్మ కూడా ప‌ర్వాలేద‌ని అనిపించాడు. మొత్తంగా రిల‌య‌న్స్ గ్రూప్ కి ఒక శుభ సూచ‌క‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌త ఏడాది ఆశించిన రీతిలో రాణించ లేదు ముంబై. ఈసారి ఆర్సీబీ విజ‌యావ‌కాశాల‌పై ఆధార‌ప‌డి ఉంది.

Also Read : MI vs SRH IPL 2023

Leave A Reply

Your Email Id will not be published!