Hardik Pandya : ధోనీ కెప్టెన్సీ అద్భుతం – పాండ్యా
బౌలర్లను తెలివిగా వాడుకున్నారు
Hardik Pandya : చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ సీఎస్కే చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 172 రన్స్ చేసింది. అనంతరం ఛేజింగ్ లో సీఎస్కే బౌలర్ల దెబ్బకు 157 పరుగులకే చాప చుట్టేసింది గుజరాత్. ఈ జట్టులో ఆఫ్గన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఒక్కడే మెరిశాడు. ఆశలు పెంచాడు. 30 పరుగులకు ఔట్ కావడంతో చెన్నై గెలుపు సాధించింది.
మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మీడియాతో మాట్లాడాడు. ప్రధానంగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కితాబు ఇచ్చాడు. అతడి నాయకత్వ పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. తన బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఇది ఆయనకు మాత్రమే చెల్లిందన్నాడు.
తాము ఔట్ అయిన విధానం కొంత ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండ్ షో చేసిందన్నాడు. తాము ఈ మ్యాచ్ లో చేసిన పొరపాట్లను క్వాలిఫయర్ -2 లో గెలుపొందిన జట్టుతో చేయబోమంటూ చెప్పాడు. మొత్తంగా గెలుస్తుందని అనుకున్న పాండ్యా సేన ఆశలపై నీళ్లు చల్లారు చెన్నై బౌలర్లు.
Also Read : MS Dhoni