CSK 10th Time Final : 10వ సారి ఫైనల్ కు చేరిన చెన్నై
అరుదైన ఘనత సృష్టించిన ధోనీసేన
CSK 10th Time Final : మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఐపీఎల్ 16వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ను 15 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే రికార్డ్ సృష్టించింది. ఏకంగా ఇప్పటి వరకు 16 సీజన్లు జరగగా అందులో 10 సార్లు ఫైనల్ కు చేరుకుంది(10th Time Final). నాలుగుసార్లు ఛాంపియన్ గా నిలిచింది.
గత సీజన్ లో తీవ్ర నిరాశ పరిచిన సీఎస్కే ఈసారి సీజన్ లో దుమ్ము రేపింది. 2008 ఐపీఎల్ లో రన్నర్ అప్స్ గా నిలిచింది. 2009లో సెమీ ఫైనల్ కు చేరుకుంది. 2010లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2011లో టైటిల్ కైవసం చేసుకుంది. 2012లో రన్నర్స్ అప్ గా నిలిచింది చెన్నై సూపర్ కింగగ్స్ . 2013లో సైతం సీఎస్కే రన్నర్స్ అప్ తో సరిపెట్టుకుంది. 2014లో ప్లే ఆఫ్స్ కే పరిమితమైంది. 2015లో రన్నర్ అప్స్ గా నిలిచింది. 2016, 2017 లో సీఎస్కే పై బీసీసీఐ బ్యాన్ విధించింది. 2018లో తిరిగి ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చింది ధోనీ సేన.
తిరిగి వచ్చీ రావడంతోనే చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది. ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. 2019లో రన్నర్ అప్స్ కే పరిమితమైంది. 2020లో 7వ స్థానంలో నిలిచింది. నిరాశ పరిచింది. 2021లో విజేతగా అవతరించింది. 2022లో తీవ్ర నిరాశకు గురి చేసింది. 9వ స్థానంతో సరి పెట్టుకుంది. 2023లో ఫైనల్ కు చేరింది. మొత్తంగా అరుదైన రికార్డ్ నమోదు చేసింది మహేంద్ర సింగ్ ధోనీ సేన.
Also Read : Hardik Pandya