Tiger Global Invest : రాజస్థాన్ రాయల్స్ లో భారీ పెట్టుబడి
టైగర్ గ్లోబల్ $650 మిలియన్ల ఇన్వె స్ట్
Tiger Global Invest : ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ కు ఈ ఏడాది జాక్ పాట్ తగిలింది. అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్(Tiger Global) కంపెనీ ఏకంగా భారీ పెట్టుబడి(Invest) పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఏకంగా $650 మిలియన్లు ఇన్వెస్ట్ చేయనుంది. భారతీయ రూపాయల పరంగా చూస్తే రూ. 320 కోట్లకు పైమాటే.
ఇప్పటికే టైగర్ గ్లోబల్ ఫ్లిఫ్ కార్ట్ , ఓలా, జొమాటో సహా పలు కంపెనీలకు మద్దతుగా నిలిచింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ తో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ దాదాపు పూర్తయిందని సమాచారం. ఐపీఎల్ లో టెక్ ఇన్వెస్టర్ జట్టుకు సపోర్ట్ చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
పలు జట్లతో చర్చలు జరిపినా చివరకు రాజస్థాన్ రాయల్స్ తో ఒప్పందం ఖరారైనట్లు టాక్. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇన్వెస్ట్ చేయనుంది టైగర్ గ్లోబల్. ఈ కంపెనీ అమెరికాలోని న్యూయార్క్ కు చెందినది. ఇప్పటి దాకా ఇన్ఫ్రా మార్కెట్, ఢిల్లీవెరీ, అప్ స్టాక్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టింది. సంస్థ ప్రారంభమైన నాటి నుంచి నేటి దాకా దాదాపు రూ. 50,000 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసింది.
2021లో యుఎస్ ఆధారిత సంస్థ రెడ్ బర్డ్ క్యాపిటల్ $250 మిలియన్ల విలువతో రాజస్థాన్ రాయల్స్ లో పెట్టుబడి పెట్టింది. ఐపీఎల్ లీగ్ లో మ్యాచ్ పరంగా చూస్తే రెండో అత్యంత విలువైన స్పోర్ట్స్ లీగ్ గా నిలిచింది. మ్యాచ్ పరంగా చూస్తే ప్రసార విలువ ఒక్కో మ్యాచ్ కు రూ. 107.5 కోట్లు. ఇది ఇంగ్లీష్ ప్రిమీయర్ లీగ్ కంటే ఎక్కువ.
Also Read : Harbhajan Singh MS Dhoni