Cameroon Green : సత్తా చాటిన కామెరూన్ గ్రీన్
ముంబై ఇండియన్స్ గెలుపులో కీలకం
Cameroon Green : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో మరోసారి సత్తా చాటాడు ముంబై బ్యాటర్ కామెరూన్ గ్రీన్(Cameroon Green). ఓ వైపు సహచరులు తక్కువ స్కోర్ కే పరిమితం కాగా గ్రీన్ మాత్రం తనదైన శైలిలో రాణించాడు. కీలకమైన పరుగులు చేస్తూ ముంబై ఇండియన్స్ కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంది.
ఓ వైపు గ్రీన్ రాణిస్తే మరో వైపు ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్ నడ్డి విరిచాడు ముంబై స్టార్ బౌలర్ రూర్కీకి చెందిన ఆకాశ్ మధ్వల్. కేవలం 3.3 ఓవర్లు వేశాడు. 17 డాట్ బాల్స్ తో 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఒక రకంగా లక్నో సూపర్ జెయింట్స్ పతనాన్ని శాసించాడు. ఇక ముంబై బ్యాటింగ్ పరంగా చూస్తే గ్రీన్ ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక గ్రీన్ 23 బంతులు ఆడి 6 ఫోర్లు 1 సిక్స్ తో 41 రన్స్ చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 20 బంతులు ఆడి 2 ఫోర్లు 2 సిక్స్ లతో 33 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 22 బంతులు ఆడి 2 సిక్స్ లతో 22 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ 15 చేస్తే రోహిత్ శర్మ 11 , డేవిడ్ 13 పరుగులతో నిరాశ పరిచారు. లక్నో బౌలర్లలో హక్ 4 , ఠాకూర్ 3 వికెట్లు తీస్తే మోసిన్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక లక్నో జట్టులో స్టాయినిస్ ఒక్కడే రాణించాడు. 40 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మేయర్స్ 18, హూడా 15 రన్స్ మాత్రమే చేశారు.
Also Read : Akash Madhwal