Revanth Laxma Reddy : రియల్ ఎస్టేట్ లో లక్ష్మారెడ్డి కింగ్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్
Revanth Laxma Reddy : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మరో వైపు బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపిస్తోంది. ఈ తరుణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జడ్చర్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆవంచ లక్ష్మారెడ్డిపై(Laxma Reddy) నిప్పులు చెరిగారు. ప్రజలకు మేలు చేస్తాడని ఎమ్మెల్యేగా గెలిపిస్తే పని చేయడం మానేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఫోకస్ పెట్టాడని ధ్వజమెత్తాడు.
రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను, ఆయన పరివారాన్ని బండకేసి కొట్టడం ఖాయమన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమని శంకర గిరి మాన్యాలు పట్టిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ హయాంలోనే జడ్చర్లలో అభివృద్ది జరిగిందని ఆ తర్వాత లక్ష్మారెడ్డి గెలిచాక తన ఆస్తులను పెంచుకోవడం పైనే దృష్టి సారించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో ప్రజలు తేలుస్తారని అన్నారు. మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసింది పాలమూరు జిల్లా అని దానిని నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా వలసలు ఆగలేదన్నారు.
Also Read : Revanth Reddy