Sanjay Raut : ప్రారంభోత్స‌వం జాతీయ కార్య‌క్ర‌మం కాదు

నిప్పులు చెరిగిన శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్

Sanjay Raut : నూత‌న భ‌వ‌న పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈనెల 28న ప్ర‌ధాని దానిని ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్తి కావ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర‌ప‌తి కాకుండా పీఎం ఎలా ప్రారంభిస్తార‌ని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఆపై కోర్టులో కూడా పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ సంద‌ర్బంగా 20 ప్ర‌తిప‌క్షాలు తాము బ‌హిష్క‌రిస్తున్నామంటూ ప్ర‌క‌టించాయి.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై తీవ్రంగా స్పందించారు శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut). శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వం అనేది జాతీయ కార్య‌క్ర‌మం ఎంత మాత్రం కాద‌న్నారు. అయితే పార్ల‌మెంట్ కు తాము వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే భార‌త రాజ్యాంగానికి చీఫ్ రాష్ట్ర‌ప‌తి. ఎందుకు ఆమెకు ఆహ్వానం అంద‌లేదా లేక కావాల‌నే పీఎం ఇలా చేశారా అన్న‌ది తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సంజ‌య్ రౌత్. దాని గురించి తాము తెలుసు కోవాల‌ని అనుకుంటున్నామ‌ని అన్నారు. దీనిపై మోదీ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్య‌త లేదా అని ప్ర‌శ్నించారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ గా ఉన్న ఉప రాష్ట్ర‌ప‌తి ఎక్క‌డ ఉన్నారంటూ మండిప‌డ్డారు సంజ‌య్ రౌత్. స్పీకర్ ఓం బిర్లాపేరు ఆహ్వాన జాబితాలో ఉండ‌డం విచిత్రంగా ఉంద‌న్నారు.

Also Read : Salman Butt

Leave A Reply

Your Email Id will not be published!