HD Kumara Swamy : కాంగ్రెస్ పై ‘కుమార’ కన్నెర్ర
పార్లమెంట్ భవనం బహిష్కరణ తప్పు
HD Kumara Swamy : కాంగ్రెస్ పార్టీపై భగ్గుమన్నారు జేడీఎస్ చీఫ్, మాజీ సీఎం కుమార స్వామి(Kumara Swamy) నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మే 28న నూతన పార్లమెంట్ భవన ప్రారంభం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా కేవలం పీఎం మాత్రమే ఓపెనింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాయి ప్రతిపక్షాలు. మొత్తం 20 పార్టీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. దీనిపై సీరియస్ గా స్పందించాడు హెచ్ డీ కుమార స్వామి.
బీజేపీ పట్ల తమ పార్టీ సాఫ్ట్ కార్నర్ గా తీసుకున్న వైఖరిని భావించరాదని స్పష్టం చేశారు. కొన్ని వర్గాలను సంతోష పెట్టడం ద్వారా ఓట్లను తనకు అనుకూలంగా మార్చు కోవడం చేసిందన్నారు. ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 సీట్లకే పరిమితమైంది జేడీఎస్. మొత్తం 224 సీట్లకు గాను 135 సీట్లు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ 65 సీట్లతో సరి పెట్టుకుంది.
ఇదిలా ఉండగా ఎక్కువ సీట్లు వస్తాయని, తామే కింగ్ మేకర్ గా మారబోతున్నామని ప్రకటించారు కుమార స్వామి. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేసింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే తప్పా గవర్నర్ కాదని ఈ సందర్భంగా కుమార స్వామి గుర్తు చేశారు. నూతన పార్లమెంట్ భవనం అనేది భారత దేశానికి గుర్తింపు అని, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించడం తప్పు అని పేర్కొన్నారు.
Also Read : Sanjay Raut