Sanjay Singh : నన్ను చంపినా ఒక్క రూపాయి దొరకదు
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ షాకింగ్ కామెంట్స్
Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. గత కొంత కాలంగా తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రతిసారి తనపై ఈడీ, సీబీఐలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కానీ వారికి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా దొరక లేదని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని కానీ పదే పదే ఇరికించాలని చూడడం మంచి పద్దతి కాదన్నారు.
దేశంలో ప్రజలు చూస్తున్నారని, బీజేపీ ,మోదీ, ఆయన పరివారం ఎలా చేస్తోందో గమనిస్తున్నారని పేర్కొన్నారు. నేను ఒక్క రూపాయి అక్రమంగా తీసుకోలేదు. సంపాదించ లేదు. నా రక్తంలో అవినీతి అన్నది లేనే లేదని మోదీ ఎంత మందిని ప్రయోగించినా, ఎన్ని దర్యాప్తు సంస్థలను నా వెంట, నా అనుచరులను టార్గెట్ చేసినా ఫలితం ఏమీ ఉండదన్నారు. ఏదో ఒక రోజు ప్రజలు తగిన తీర్పు ఇవ్వడం ఖాయమని స్పష్టం చేశారు.
దేశంలో అదానీకి నువ్వు ఎలా వనరులను కట్టబెడుతూ వచ్చావో యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. ఘోడీ మీడియా మోదీని ప్రమోట్ చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ, అదానీకి మధ్య స్కాం ను త్వరలో బయట పెడతానని హెచ్చరించారు ఎంపీ సంజయ్ సింగ్.
Also Read : YS Sharmila KCR