S Jai Shankar : ఆదర్శ గ్రామలు అభివృద్దిలో భేష్
ప్రశంసించిన కేంద్ర మంత్రి జై శంంకర్
S Jai Shankar : గుజరాత్ రాష్ట్రంలోని ఆదర్శ గ్రామాలు సాధించిన అభివృద్ది అద్భుతమని కొనియాడారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar). రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయని లబ్దిదారులను, గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గిరిజనులు అధికంగా ఉండే నర్మదా జిల్లా లోని రాజ్ పిప్లా పట్టణంలో పర్యటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద దత్తత తీసుకున్న జిల్లా లోని నాలుగు గ్రామాలను ఎస్ జై శంకర్ పర్యటించారు. ముందుగా తిలక్వాడ తాలూకా లోని వ్యాదర్ గ్రామాన్ని సందర్శించారు. నర్మదా లోని గరుడేశ్వర్ తాలూకా లోని అమ్దాలా ఊరులో పర్యటించారు. గ్రామస్థులతో ముఖాముఖి చేపట్టారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రత్యేకంగా విన్నారు. ఇదే సమయంలో సన్సద్ కార్యక్రమం కింద ఎలా అభివృద్ది చెందారో కూడా తెలుసుకున్నారు.
దేడియాపాడ తాలూకాలోని సగ్భారా లోని భడోడ్ గ్రామాన్ని, మల్సా మోట్ పల్లెను సందర్శించారు. ఇవాళ రాజ్ పిప్లా పట్టణంలోని కళాశాలలో నిర్మాణంలో ఉన్న జిమ్నాస్టిక్స్ హాల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాలు సాధించిన ప్రగతి అద్భుతమన్నారు.
Also Read : DK Shiva Kumar