Bhupesh Bhaghel Kharge : ఖర్గేను కలిసిన సీఎం బఘేల్
కీలక అంశాలపై చర్చలు
Bhupesh Bhaghel Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను(Kharge) ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Bhaghel) న్యూఢిల్లీలో కలుసుకున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనుల గురించి మల్లికార్జున్ ఖర్గేకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఇతర విజయాలు , చేపట్టిన కార్యక్రమాల గురించి తెలిపారు ఖర్గేకు. ఈ సందర్భంగా సీఎం భూపేష్ బఘేల్ ను ప్రత్యేకంగా అభినందించారు ఖర్గే.
ఐదు రోజుల పర్యటన నిమిత్తం సీఎం భూఫేస్ బఘేల్ ఢిల్లీకి చేరుకున్నారు. అంతకు ముందు ఆయన దేశ రాజధానిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగిన ప్రీ బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు.
ఇదిలా ఉండగా ప్రీ బడ్జెట్ సమావేశంలో 2023-2024 సాధారణ బడ్జెట్ కు సంబంధించి సీఎం భూపేష్ బఘేల్ అనేక ప్రతిపాదనలు, సూచనలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా, ఇతరులను ప్రోత్సహించేందుకు మెరుగైన ఆర్థిక నిర్వహణ ఉన్న రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా గ్రాంట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కాగా సీఎం చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆయనను ప్రశంసించారు.
అంతే కాకుండా ఎన్పీఎస్ మొత్తాన్ని వాపసు చేయాలని, జీఎస్టీ పరిహారం, కోల్ బ్లాక్ కంపెనీల నుండి అదనపు లెవీగా వసూలు చేసిన మొత్తాలను బదిలీ చేయాలనే రాష్ట్ర డిమాండ్ ను ప్రీ బడ్జెట్ సమావేశంలో సీఎం పునరుద్ఘాటించారు.
Also Read : S Jai Shankar