Chiranjeevi K Vasu : డైరెక్టర్ వాసు మరణం తీరని లోటు
మెగాస్టార్ చిరంజీవి సంతాపం
Chiranjeevi K Vasu : ప్రముఖ దర్శకుడు కె. వాసు(K Vasu) కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం అలుముకుంది. చిరంజీవిలో(Chiranjeevi) టాలెంట్ ను గుర్తించిన వ్యక్తి కె. వాసు. ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవిని వెండి తెరకు పరిచయం చేశారు. ప్రతిభా నైపుణ్యం కలిగిన దర్శకుడిగా గుర్తింపు పొందారు కె. వాసు. ఆయన మరణ వార్తతో తాను తల్లడిల్లి పోయానని పేర్కొన్నారు నటుడు మెగాస్టార్ చిరంజీవి. ట్విట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. తన కెరీర్ కు పునాది వేసిన కె. వాసును తాను మరిచి పోలేనని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
దర్శకుడి మృతితో గొప్ప వ్యక్తిని కోల్పోయిందని సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కె. వాసు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఫిలిం నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కె. వాసు ప్రాణం ఖరీదుతో పాటు కోతల రాయుడు, తోడు దొంగలు, అల్లుళ్లు వస్తున్నారు సినిమాలను తీశాడు.
అంతే కాదు హాస్య నట చక్రవర్తిగా పేరు పొందిన బ్రహ్మానందంను హీరోగా పెట్టి తీశారు డైరెక్టర్ కె. వాసు. జోకర్ మామ సూపర్ అల్లుడు సినిమా తీశారు. దీనికి మంచి ఆదరణ లభించింది. ప్రముఖ నటుడు విజయ చందర్ తో సాయిబాబాగా నటింప చేశారు. శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం సినిమాను తీశారు కె. వాసు. చివరగా నటులు శ్రీకాంత్, ప్రభు దేవాలతో ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి చిత్రాన్ని తీశారు. ఇది బిగ్ హిట్ గా నిలిచింది.
Also Read : CM YS Jagan