MS Dhoni : కోట్లాదీ క‌ళ్ల‌న్నీ క్రికెట్ డైన‌మెట్ పైనే

ఐపీఎల్ 16వ సీజ‌న్ ఆఖ‌రు కానుందా

MS Dhoni : భార‌త క్రికెట్ రంగంలో మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్. స్కిప్ప‌ర్ గా పేరు పొందాడు జార్ఖండ్ కు చెందిన మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni). మిస్టర్ కూల్ ఏం చేయ‌బోతున్నాడ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఐపీఎల్ సంబురం ఆఖ‌రి అంకానికి చేరుకుంది. కానీ కోట్లాది క‌ళ్ల‌న్నీ ఇప్పుడు ఎంఎస్డీపైనే ఉన్నాయి. ఎందుకంటే ఇదే చివ‌రి టోర్నీ అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చెన్నైలో జ‌రిగిన కీల‌క పోరులో స్టేడియం మొత్తం క‌లియ తిరుగుతూ ప్రేక్ష‌కుల‌కు అభివాదం చేశాడు. దీన్ని బ‌ట్టి ధోనీ ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుంటున్నాడ‌ని టాక్ కొన‌సాగుతోంది.

ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం మాత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మ‌హేంద్ర సింగ్ ధోనీ ఉన్నంత వ‌ర‌కు త‌మ జ‌ట్టుకు అత‌డే కింగ్ అని స్ప‌ష్టం చేసింది. క్రికెట్ కు , టీమ్ కు గుడ్ బై చెప్ప‌డం అనేది జ‌ర‌గ‌ద‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ధోనీ మాత్రం త‌న మ‌న‌సులోని మాట‌ను ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట పెట్ట‌లేదు.

ఏం జ‌రుగుతుంద‌నేది ఇంకా తెలియ‌క చెన్నై జ‌ట్టు ఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక త‌న జీవితంలో అత్యుత్త‌మ‌మైన మ‌ధుర క్ష‌ణం త‌న జ‌ట్టుకు ఈసారి ఐపీఎల్ టైటిల్ ను అందించాల‌న్న‌ది కృత నిశ్చ‌యంతో ఉన్నాడు మ‌హేంద్ర సింగ్ ధోనీ. మ‌రి త‌న క‌ల‌ను నెర‌వేర్చుకుంటాడా లేక ర‌న్న‌ర్ అప్ గా నిలుస్తాడా అన్న‌ది వేచి చూడాలి. ఇక ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఏకంగా 10 సార్లు ఫైన‌ల్ కు చేరుకుంది. ఇది ఓ రికార్డ్ ఆ జ‌ట్టుకు.

Also Read : Nitish Kumar

 

Leave A Reply

Your Email Id will not be published!