NTR TDP : తెలుగుదేశం ఎన్టీఆర్ జపం
ఇన్నేళ్లయినా తరగని ఆదరణ
NTR TDP : వెండి తెరపై అందాల రాముడిగా, రాజకీయ రంగంలో అరుదైన నాయకుడిగా తనదైన ముద్ర వేసిన దివంగత సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరు మార్మోగిపోయింది రాజమండ్రిలోని రాజమహేంద్రవరం. ప్రజా జీవితంలో సంక్షేమ రాముడు, సినీ, రాజకీయ రంగాలను చివరి దాకా శాసించిన వ్యక్తి ఎన్టీఆర్(NTR). 44 ఏళ్ల పాటు తెలుగు సినీ రంగాన్ని శాసించారు. ఒకరకంగా ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేసిన ఓ విలేకరి అడిగిన ప్రశ్న దేశ రాజకీయాలను మలుపు తిప్పేలా చేస్తుందని ఎవరూ ఊహించ లేదు.
ఎందుకంటే ప్రజా జీవితంలోకి వస్తారా అన్న ఒకే ఒక్క ప్రశ్నకు తాను రెడీ అని ఆనాడే ప్రకటించారు. అదే 1982లో తెలుగుదేశం పార్టీగా(TDP) ఆవిర్భవించింది. చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్ ఏది చెప్పినా అది సంచలనమే. దేశంలోనే అతి తక్కువ కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఆ దివంగత నాయకుడి పేరుతో శత జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. సభ మొత్తం ఎన్టీఆర్ ను పొగడడంతోనే సరి పోయింది. 9 సంవత్సరాల పాటు సీఎంగా కొలువు తీరిన ఎన్టీఆర్ ఇక సెలవంటూ వెళ్లి పోయారు 1996లో . ఇప్పటికీ ఆయనను స్మరించుకుంటోంది తెలుగుజాతి. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. మహానాడులో ఆయన పేరుతో వెలసిన పోస్టర్లు హైలెట్ గా నిలిచాయి.
Also Read : Chandrababu Naidu