TTD Rush : తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్త‌జ‌నం

ఆదివారం 78,818 మంది ద‌ర్శ‌నం

TTD Rush : కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా వినుతికెక్కిన క‌లియుగ దైవంగా భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో నిండి పోయింది(TTD Rush). వేస‌వి సెల‌వులు కావ‌డంతో భారీ ఎత్తున భ‌క్తులు కొండ‌పైకి చేరుకుంటున్నారు. ప్ర‌తి రోజూ భ‌క్తులు 78 వేల‌కు పైగా ద‌ర్శించు కుంటున్నారు.

ఆదివారం కావ‌డంతో భ‌క్తులు పోటెత్తారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఊహించ‌ని రీతిలో త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సుప‌థం, బ్రేక్ ద‌ర్శ‌నం, రూ. 300 టోకెన్లు తీసుకున్న వారికి 2 నుంచి 3 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది స్వామి వారి ద‌ర్శ‌నం.

ఇదిలా ఉండ‌గా ఒక్క రోజే ఏకంగా 78,818 మందికి పైగా భ‌క్తులు స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకున్నారు.
కాగా హుండీ కానుకలు, ఆదాయం రూపేణా రూ. 3.66 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. వెయిటింగ్ కంపార్ట్ మెంట్లు 23 దాకా వేచి ఉన్నారు భ‌క్తులు. ఇదిలా ఉండ‌గా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మల ద‌ర్శ‌నం 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు.

Also Read : WFI Chief

Leave A Reply

Your Email Id will not be published!