Revanth Reddy Bus Yatra : తెలంగాణ‌లో రేవంత్ బ‌స్సు యాత్ర‌

యూఎస్ టూర్ త‌ర్వాత ప్రారంభం

Revanth Reddy Bus Yatra : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి బ‌స్సు యాత్ర(Revanth Reddy Bus Yatra) చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు అధిష్టానం నుంచి కూడా క్లియ‌రెన్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. యూఎస్ టూర్ త‌ర్వాత తెలంగాణ‌లో బ‌స్సు యాత్ర కొన‌సాగ‌నుంది. ఈ యాత్ర‌లో సీనియ‌ర్ నాయ‌కులు కూడా పాల్గొంటార‌ని టీపీసీసీ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి యాక్ష‌న్ లోకి దిగింది. ఈ త‌రుణంలో మ‌రో వైపు సీఎల్పీ నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు పీపుల్స్ మార్చ్ చేప‌ట్టారు. ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రారంభ‌మైన ఈ యాత్ర ప్ర‌స్తుతం ఉమ్మ‌డి పాలమూరు జిల్లాలో కొన‌సాగుతోంది. తాజాగా జ‌డ్చ‌ర్ల‌లో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ అనుకున్న దానికంటే స‌క్సెస్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.

ఈ స‌భ‌కు ముఖ్య అతిథిగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం సుఖ్వింద‌ర్ సుఖు హాజ‌ర‌య్యారు. ప్ర‌ముఖ నేత‌లంతా ఆసీనుల‌య్యారు. ఇదిలా ఉండ‌గా ఈసారి ఎలాగైనా ప‌వ‌ర్ లోకి రావాల‌ని రేవంత్ రెడ్డి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఆ మేర‌కు ఆయ‌న పార్టీని బ‌లోపేతం చేయ‌డంతో పాటు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ప‌రుగులు పెట్టిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సంతోషం వ్య‌క్తం అవుతోంది. ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వాన్ని కాద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు భారీ మెజారిటీని కాంగ్రెస్ కు క‌ట్ట‌బెట్టారు. దీంతో తెలంగాణ‌లో సైతం బీఆర్ఎస్ కు మంగ‌ళం పాడి హ‌స్తం జెండా ఎగుర వేయాల‌న్న‌ది లక్ష్యంగా పెట్టుకుంది ఏఐసీసీ.

Also Read : Rahul Gandhi

Leave A Reply

Your Email Id will not be published!