Air India CEO : ఎయిర్ ఇండియాలో జాబ్స్ జాత‌ర

ప్ర‌తి నెలా 600 పైల‌ట్లు, క్యాబిన్ క్రూ భ‌ర్తీ

Air India CEO : ప్ర‌ముఖ భార‌తీయ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. భారీగా కొలువుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు సంస్థ సిఇఓ క్యాంప్ బెల్ విల్స‌న్ ప్ర‌క‌టించారు(Air India CEO). సోమ‌వారం సిఇఓ మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి ఏడాదిలో ఒక‌సారి కాకుండా ప్ర‌తి నెలా 600 మంది పైల‌ట్లు, 550 మంది క్యాబిన్ క్రూ సిబ్బందిని భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూల్స్ ను మార్చిన‌ట్లు చెప్పారు. ప్ర‌తి నెలా పైల‌ట్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది త‌మ విభాగాల‌లో శిక్ష‌ణ పొందుతున్నార‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం ఎయిర్ ఇండియా 122 విమానాల‌ను క‌లిగి ఉంద‌న్నారు. త్వ‌ర‌లోనే వాటిని విస్త‌రించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ఆరు విస్తృత బాడీ క‌లిగిన ఏ350 విమానాలు ఈ ఏడాది చివ‌రి నాటికి తీసుకు రానున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఎయిర్ లైన్ నియామ‌క ప్ర‌ణాళిక గురించి వివ‌రించారు మేనేజింగ్ డైరెక్ట‌ర్, సిఇఓ అయిన క్యాంప్ బెల్. వ్య‌క్తిగ‌తంగా ఎటువంటి టార్గెట్ లేద‌న్నారు. ఎయిర్ ఇండియా ప్ర‌పంచ వ్యాప్తంగా ఇత‌ర ఎయిర్ లైన్స్ తో పోటీ ప‌డుతోంద‌న్నారు. క్యాబిన్ క్రూ స‌భ్యుల విష‌యంలో ఇది దాదాపు ప‌ది రెట్లు , పైలట్ల విష‌యంలో ఇది ప్రీ ప్రైవేటీక‌రించిన ఎయిర్ లైన్ వార్షిక రేటుపై ఐదు రెట్లు అని ఢిల్లీలో వెల్ల‌డించారు.

Also Read : GSLV F12 Rocket

 

Leave A Reply

Your Email Id will not be published!