Rivaba Jadeja Dhoni : ఎంఎస్ ధోనీ ఓ అద్భుతం – రివాబా జ‌డేజా

ప్ర‌శంస‌లు కురిపించిన జ‌డేజా భార్య

Rivaba Jadeja Dhoni : అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియం హోరెత్తి పోయింది. ధోనీ ఫ్యాన్స్ తో ద‌ద్ద‌రిల్లింది. ఎక్క‌డ చూసినా సంబురాలు మిన్నంటాయి. విజ‌యోత్స‌వ వేడుక‌లు కొన‌సాగుతున్నాయి. యావ‌త్ దేశ‌మంతా ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ను వీక్షించింది. కానీ ఊహించ‌ని రీతిలో చివ‌రి బంతి దాకా టెన్ష‌న్ వాతావ‌రణం నెల‌కొంది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగింది. నిర్దేశించిన 171 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సీఎస్కే ఛేదించింది. ఐపీఎల్ 2023 విజేత‌గా నిలిచింది.

మ్యాచ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు డేవాన్ కాన్వే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్ , అజింక్యా ర‌హానే. ఆఖ‌రున సీన్ మ‌రింత టెన్ష‌న్ కు దారి తీసింది. చివ‌రి ఓవ‌ర్ లో 13 ర‌న్స్ కావాలి. ఆరు బంతులు మిగిలి ఉన్నాయి. మోహిత్ శ‌ర్మ కు ఛాన్స్ ఇచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. చివ‌రి నాలుగు బంతుల్లో కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. స్టేడియం అంతా నిశ్శ‌బ్దానికి లోనైంది. గుజ‌రాత్ టైటాన్స్ శిబిరాల్లో సంబురాలు మొద‌ల‌య్యాయి. మ‌రో వైపు ధోనీ సేన స్టేడియంలో ఏం జ‌రుగుతుందోన‌ని వేచి చూశారు.

ఓ వైపు శివ‌మ్ దూబే 32 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిస్తే ర‌వీంద్ర జ‌డేజా ఆఖ‌రు రెండు బంతుల్లో 10 ర‌న్స్ చేయాల్సి వ‌చ్చింది. 5వ బంతిని సిక్స‌ర్ గా మలిస్తే 6వ బంతిని ఫోర్ కొట్టాడు. దీంతో సీఎస్కే గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. అనంతరం ఉత్సాహం త‌ట్టుకోలేక జ‌డేజా భార్య రెవ‌బా జ‌డేజాను(Rivaba Jadeja) హ‌త్తుకున్నాడు. ఈ సంద‌ర్బంగా జ‌డేజా భ‌ర్య ధోనీకి(Dhoni) థ్యాంక్స్ చెప్పింది. అద్బుత‌మైన నాయ‌కుడంటూ కితాబు ఇచ్చింది.

Also Read : Jadeja Hugs Wife

Leave A Reply

Your Email Id will not be published!