IPL 2023 Game Changer : గేమ్ ఛేంజర్ విలువైన ప్లేయర్
శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డ్
IPL 2023 Game Changer : ఐపీఎల్ 16వ సీజన్ 2023 ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. రన్నర్ అప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు అవార్డుల పంట పండింది. ఆరెంజ్ క్యాప్ , పర్పుల్ క్యాప్ , గేమ్ ఛేంజర్ , వాల్యూబుల్ ప్లేయర్, క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డులన్నీ గుజరాత్ ఆటగాళ్లకే దక్కడం విశేషం. శుభ్ మన్ గిల్ , షమీ, రషీద్ ఖాన్ వరుసగా పురస్కారాలు అందుకున్నారు. ఒక్కొక్కరికీ ప్రైజ్ మనీ కింద రూ. 10 లక్షల చొప్పున ఐపీఎల్ బీసీసీఐ అందజేసింది.
ఇక సూపర్ స్ట్రైకర్ అవార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్ దక్కించుకోగా క్యాచ్ ఆఫ్ ది సీజన్ మాత్రం ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ కు దక్కడం విశేషం. తాజాగా ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న గిల్ 17 ఇన్నింగ్స్ లు ఆడి 890 పరుగులు చేశాడు. అంతే కాదు ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు పొందాడు.
ఆపై సీజన్ లో గేమ్ ఛేంజర్ గా పురస్కారం పొందాడు శుభ్ మన్ గిల్(IPL 2023 Game Changer). మరో వైపు అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్ గా కూడా గిల్ కే అవార్డు లభించడం విశేషం. ఫెయిర్ ప్లే అవార్డు మాత్రం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్లుకు దక్కడం విశేషం. ఇదిలా ఉండగా ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు రూ. 20 కోట్లు ప్రైజ్ మనీ దక్కగా రన్నర్ అప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ కు రూ. 12. 5 కోట్లు లభించాయి.
Also Read : Super Striker Maxwell